IND vs WI : తిరువనంతపురం (Thiruvanantapuram) వేదికగా భారత్-వెస్టిండీస్ (India vs Westindies) జట్ల మధ్య తొలి వన్డే (First ODI) మ్యాచ్ జరుగుతున్నది. భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో నమన్ ధీర్ వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడు. దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఆడుతుండటంతో అందరి దృష్టి వారిపైనే ఉంది.
భారత జట్టు : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, నమన్ ధీర్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్, ప్రసిధ్ కృష్ణ.
వెస్టిండీస్ జట్టు : జాన్ క్యాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, కీసీ కార్టీ, షై హోప్, అమిర్ జంగూ, జెవెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, గుడాకేశ్ మోటీ, అల్జారి జోసెఫ్, జేడెన్ సీల్స్.