Honeymoon Murde | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) తన నేరాన్ని (Honeymoon Murder in Meghalaya) అంగీకరించినట్లు సమాచారం. ఈ హత్యలో తన ప్రమేయం ఉందని సోనమ్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసింది.
మేఘాలయ పోలీసులు కేసులో ప్రధాన నిందితురాలైన రాజా రఘువంశీ భార్య సోనమ్‌ను ఉత్తరప్రదేశ్ నుంచి, రఘువంశీపై దాడిచేసి హతమార్చిన కిరాయి హంతకులను మధ్యప్రదేశ్ నుంచి ట్రాన్సిట్ రిమాండ్‌పై షిల్లాంగ్‌కు తీసుకొచ్చి సదార్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా తన భర్త రాజా రఘువంశీని తానే హత్య చేయించినట్లు విచారణ సందర్భంగా మేఘాలయా పోలీసులు ఎదుట సోనమ్ ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమె వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట రికార్డ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మే 23 నుంచి ఆ జంట ఆచూకీ లేకుండా పోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్ 2న ఉత్తర కాసీ కొండల్లోని లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం కనిపించింది. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుల నుంచి పలు వివరాలు రాబడుతున్నారు.
Also Read..
“Sonam Raghuvanshi | రాజా రఘువంశీతో ఇష్టంలేని పెళ్లి.. తల్లిని ముందే హెచ్చరించిన సోనమ్”
“Meghalaya murder | ఆ రక్తపు మరకలు రాజా రఘువంశీవే.. ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడి”
“Meghalaya murder | రాజా రఘువంశీ హత్యకు ముందు ఏం జరిగిందంటే..!”