న్యూఢిల్లీ : బీజేపీ నేత, బిగ్‌బాస్ 14 ఫేం సొనాలి ఫోగట్ మరణంపై ఆమె సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొనాలి ఫోగట్ గోవా పర్యటనలో ఉండగా తీవ్ర గుండెపోటుతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. నటి మరణం అనుమానాస్పదంగా ఉందని సొనాలి సోదరి పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్ వల్లే సొనాలి ఫోగట్ తీవ్ర అనారోగ్యానాకి గురయ్యారని ఆమె సోదరి ఆరోపించారు.
సొనాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆహారం తీసుకున్న తర్వాత అసౌకర్యంగా ఉందని చెప్పారని, తన ఆహారంలో కొందరు ఏదో మిక్స్ చేశారని అనుమానం వ్యక్తం చేశారని కూడా సొనాలి పోగట్ సోదరి విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. అయితే సొనాలి ఫోగట్ మరణంలో అనుమాస్పదంగా ఏవీ బయటపడలేదని పోలీసులు తోసిపుచ్చారు. ఇక గోవా టూర్లో ఉన్న సోనాలి ఫోగట్‌కు తీవ్ర గుండెపోటు రావడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.
బిగ్ బాస్ 14లో ఆమె చివరిసారి కనిపించారు. వైల్డ్‌కార్డ్ తో ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత పాపులర్ స్టారయ్యారు. సోనాలికి ఒక కూతురు ఉన్నది. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఆదంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. టిక్‌టాక్‌లోనూ సోనాలికి పాపులారిటీ ఉంది. ఏక్ మా జో లాకోం కి లియే బనీ అమ్మా అనే టీవీ సీరియల్లో నటించింది. కొన్ని హర్యానా చిత్రాల్లో నటించారు. పంజాబీ, హర్యాన్వీ మ్యూజిక్ వీడియోల్లోనూ ఆమె కనిపించింది. ద స్టోరీ ఆఫ్ బద్మాష్‌ఘర్ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. సోనాలి భర్త సంజయ్ ఫోగట్ 2016లో అనుమానాదస్ప రీతిలో తన ఫామ్‌హౌజ్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే.