Mumbai | రాబోయే అతి కొద్ది రోజుల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఏదో పెద్ద సంఘటన జరగబోతోందంటూ ఓ వ్యక్తి పోలీసులకు (Mumbai Police) ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం తీవ్ర కలకలరం రేపుతోంది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.
మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తనను తాను షోయబ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ముంబై నగరంలో రాబోయే అతి కొద్ది రోజుల్లో ‘ఏదో పెద్ద సంఘటన’ జరగబోతోందంటూ (Something big will happen in Mumbai soon) చెప్పాడు. గుజరాత్‌కు చెందిన సమా అనే మహిళ.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఆసిఫ్ అనే వ్యక్తితో కలిసి ముంబైలో ఏదో పెద్ద ఘటనకు ప్లాన్ చేసిందని పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫోన్ నంబర్లను కూడా పోలీసులకు ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Visa Services | భారత్ కీలక నిర్ణయం.. కెనడాలో ఈ-వీసా సేవల పునరుద్ధరణ
Plane Crashes | పార్కింగ్ లాట్లో కూలిన విమానం.. పైలట్ మృతి