పెళ్లి వయసు పెంచుతున్నాం.. కానీ కొందరు ఇబ్బందిపడుతున్నారు: ప్రధాని మోదీ

ప్రయాగ్‌రాజ్: అమ్మాయిల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కన్యా సుమంగళ యోజన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అమ్మాయిలు ఉన్నత చదువులు పూర్తి చేసేందుకు, వారికి సమాన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం మహిళల వివాహ వయసును పెంచినట్లు ప్రధాని మోదీ తెలిపారు. కానీ ఈ నిర్ణయం పట్ల కొందరు ఆందోళనకు గురవుతున్నట్లు ఆయన ఆరోపించారు. యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని తప్పుపట్టిన విషయం తెలిసిందే.
మహిళా సాధికారత కోసం యూపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ అన్నారు. కన్యా సుమంగళ పథకం రాష్ట్రంలోని అమ్మాయిలకు ఎక్కువగా లబ్ధి చేకూర్చుతుందని తెలిపారు. యూపీ అమ్మాయిలకు ఇప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చిందన్నారు. గత ప్రభుత్వాలకు మళ్లీ ఛాన్స్ ఇవ్వమన్న ఆలోచనల్లో యూపీ ఆడపడుచులు ఉన్నట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

