ఇంఫాల్: మణిపూర్‌లోని పశ్చిమ ఇంఫాల్ జిల్లా, లంసంగ్లో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపులో గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో దారుణం జరిగింది. మణిపూర్ పోలీసులు ఎక్స్ వేదికగా తెలిపిన సమాచారం ప్రకారం, ఓ జవాన్ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 8 మంది గాయపడ్డారు.
అనంతరం ఆ జవాన్ కూడా తనను తాను కాల్చుకుని మరణించారు. వ్యక్తిగత వివాదమే దీనికి కారణమని తెలుస్తున్నది.