Encounter | ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో సైనికుడి వీరమరణం..!
Encounter | జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్ మారుమూల అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల సంచరిస్తున్నారన్న సంచారం మేరకు భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో బలగాలను గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు.
Encounter | జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్ మారుమూల అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల సంచరిస్తున్నారన్న సంచారం మేరకు భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో బలగాలను గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ సైనికుడు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారు జామున ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం సాయంత్రం ఉధంపూర్లోని దూదు-బసంత్గఢ్ ప్రాంతంలోని సియోజ్ ధార్ అటవీ సరిహద్దు వద్ద సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టిన బృందం గాలింపులు చేపట్టాయి.
అయితే, ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైనికుడు గాయపడ్డాడు. గాయపడ్డ సైనికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో శుక్రవారం రాత్రి నుంచి మోహరించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. శనివారం ఉదయం మళ్లీ సంయుక్త ఆపరేషన్ తిరిగి ప్రారంభించినట్లు చెప్పారు. అటవీ ప్రాంతంలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో డ్రోన్స్, స్నిఫర్ డాగ్లు, అదనపు దళాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. అయితే, ఇప్పటి వరకు ఉగ్రవాదులతో కాల్పులు జరుగలేదని అధికారులు వివరించారు.
#WATCH | Udhampur, J&K: Security tightened in Udhampur district, especially on Jammu-Srinagar National Highway, after an encounter broke out between security forces and terrorists in Seoj Dhar area of Udhampur District, at Doda-Udhampur Border last evening.
(Visuals deferred by… pic.twitter.com/YP2uB8UtMd
— ANI (@ANI) September 20, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

