శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) కొనసాగుతున్నాయి. ఉధంపూర్‌లోని దుడు బసంత్‌గఢ్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించడంతో భద్రతా బలగాలు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.
భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఓ ఆర్మీ జవాను గాయపడ్డారు. ఆయనను చికిత్స కోసం దవాఖానకు తరలించారు. టెర్రరిస్టులను జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందినవారిగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతున్నదని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.