Himachal Pradesh | 2024 సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. 2025 సంవత్సరానికి వెల్కం చెప్పేందుకు అందరూ రెడీ అవుతున్నారు. అయితే, చాలా మంది వినూత్నంగా న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. స్నేహితులు, కుటుంబీకులతో కలిసి పార్టీలు జరుపుకోవడంతోపాటు విహార యాత్రలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలోనే హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) పర్యాటకులతో కళకళలాడుతోంది.
Manali:Due to heavy snowfall, more than 1500 vehicles got stuck between Palchan and Solang Nala on Friday evening, after which there was a jam of about 6 km on the road. The administration is having a lot of trouble rescuing the stranded vehicles.#HimachalPradesh #Snow #Manali pic.twitter.com/Rn1VExByus
— Smriti Sharma (@SmritiSharma_) December 28, 2024
ప్రస్తుతం హిమాచల్‌లో భారీగా మంచు పడుతోంది. శుక్రవారం లాహౌల్ – స్పితి, మనాలి (Manali) ఎగువ ప్రాంతాల్లో భారీగా మంచు కురిసింది. సోలాంగ్ వ్యాలీ, రోహ్‌తంగ్‌పాస్, అటల్ టన్నెల్ ప్రాంతాలు మంచుతో పర్యాటకుల ఆహ్వానిస్తున్నాయి. న్యూఇయర్‌కి తోడు మంచు అందాలు పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కొండ ప్రాంతానికి పోటెత్తుతున్నారు. సిమ్లా, మనాలి, కసోల్ తదితర ప్రాంతాలు పర్యాటకులతో సందడిగా మారాయి. మరోవైపు భారీగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది (Heavy traffic).
#WATCH | Himachal Pradesh: Solang Valley in Kullu district receives fresh snowfall. pic.twitter.com/cgo6JXZpPJ
— ANI (@ANI) December 27, 2024
గత వారం రోజుల్లో 30 వేల మందికి పైగా ప్రజలు మనాలిని సందర్శించినట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా 10 వేల వాహనాలు పట్టణంలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. న్యూఇయర్ వేడుకల కోసం సుమారుగా 20 వేల మందికిపైగా పర్యాటకులు హిల్ స్టేషన్‌ను సందర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం మనాలి – సోలాంగ్ నాలా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.
WATCH: Over 1,500 vehicles are stranded between Solang Valley and Palchan due to heavy snowfall in Manali, Himachal Pradesh.#Snowfall #Manali #Traffic #Trending #Viral #ViralVideo pic.twitter.com/9z9jinetP1
— TIMES NOW (@TimesNow) December 27, 2024
సోలాంగ్ వ్యాలీలో భారీగా మంచు కురుస్తుండటంతో ముందు వాహనాలు కనిపించని పరిస్థితి. ఈ కారణంగా సుమారు 1,000 వాహనాలు అక్కడ చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఆయా వాహనాల్లో దాదాపు 5000 మంది పర్యాటకులు ఉన్నట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పర్యాటకులను కులు పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.
Due to fresh snowfall on 27th December, about 1000 tourists and other vehicles were stuck in Solang Nala. There were about 5000 tourists in these vehicles. The vehicles and tourists have been rescued by Kullu Police and taken to safe places. The rescue operation is still going… pic.twitter.com/8fk7rrRXPe
— ANI (@ANI) December 28, 2024
Also Read..
Manmohan Singh | ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ సింగ్ భౌతికకాయం తరలింపు
Manmohan Singh | మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభం
America Visa | భారతీయులకు అమెరికా వీసాలు.. వరుసగా రెండో ఏడాదీ 10 లక్షలకు పైగా!