America Visa | భారతీయులకు అమెరికా వీసాలు.. వరుసగా రెండో ఏడాదీ 10 లక్షలకు పైగా!
వరుసగా రెండో సంవత్సరం విజిటర్ వీసాలతోసహా 10 లక్షలకు పైగా నాన్ ఇమిగ్రంట్ వీసాలను అమెరికా భారత్‌కు జారీ చేసింది. 2008/2009 విద్యా సంవత్సరం తర్వాత 2024లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులను అమెరికాకు పంపించిన ఘనత భారత్ దక్కించుకున్నట్టు భారత్‌లోని అమెరికన్ ఎంబసీ శుక్రవారం ప్రకటించింది.
America Visa | న్యూఢిల్లీ: వరుసగా రెండో సంవత్సరం విజిటర్ వీసాలతోసహా 10 లక్షలకు పైగా నాన్ ఇమిగ్రంట్ వీసాలను అమెరికా భారత్‌కు జారీ చేసింది. 2008/2009 విద్యా సంవత్సరం తర్వాత 2024లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులను అమెరికాకు పంపించిన ఘనత భారత్ దక్కించుకున్నట్టు భారత్‌లోని అమెరికన్ ఎంబసీ శుక్రవారం ప్రకటించింది. వరుసగా రెండేళ్లు అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులను అమెరికాకు పంపిన దేశాలలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని అమెరికన్ మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
గడచిన నాలుగేళ్లుగా అమెరికాకు అత్యధికంగా భారతీయులు ప్రయాణిస్తున్నారని తెలిపింది. ఈ ఏడాది అమెరికాలో ఉంటూనే హెచ్1-బీ వీసా రెన్యువల్ చేసుకునేందుకు ఒక పైలట్ కార్యక్రమాన్ని విజయవంతంగా తమ విదేశాంగ శాఖ అమలు చేసిందని ఎంబసీ తెలిపింది. దీని వల్ల దేశాన్ని వీడకుండానే తమ వీసాలను రెన్యువల్ చేసుకునే అవకాశం భారతీయ ప్రత్యేక వృత్తి నిపుణులకు లభిస్తుందని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

