బెంగళూరు, జూన్ 19:అమెజాన్‌లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్‌ను ఆర్డర్ చేసిన ఓ బెంగళూరు జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది. పార్సిల్‌ను విప్పడానికి ప్రయత్నించినప్పుడు లోపల నుంచి పాము బయటికి వచ్చింది. అయితే అది టేపుకు ఇరుక్కుపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి పెద్దయెత్తున విమర్శలు రావడంతో ఎట్టకేలకు పార్సిల్ అందుకున్న జంటకు అమెజాన్ క్షమాపణలు చెప్పింది.