న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల(Haryana Polls) ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల సంఘం వద్ద తమ ఫిర్యాదును నమోదు చేసింది. ఓట్ల లెక్కింపునకు చెందిన ఆధిక్యం, ఫలితాల వివరాలను ఎన్నికల వెబ్సైట్లో చాలా ఆలస్యంగా పబ్లిష్ చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ఈసీ వద్ద తమ ఫిర్యాదు నమోదు చేస్తున్నామని, ఎందుకంటే 10-11 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు పూర్తి అయినా, కేవలం నాలుగు లేదా అయిదు రౌండ్ల ఫలితాలు మాత్రమే వెబ్సైట్లో కనిపిస్తున్నాయని జైరాం రమేశ్ పేర్కొన్నారు.
ఒకరకమైన మానసిక క్రీడను, మైండ్ గేమ్స్ ఆడుతున్నారన్నారు. ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్దమైన వ్యవస్థ అని, ఆ సంస్థ వత్తిడికి లోనుకావద్దు అన్నారు. ఎన్నికల సంఘానికి లేఖ రాశానని, 12 రౌండ్లకు చెందిన డేటా అందుబాటులో ఉన్నా.. వాటిని ఎందుకు ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. హర్యానా ప్రజలు మార్పు కోరుతున్నారని, ప్రజాతీర్పు కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పోస్టల్ ఓట్ల లెక్కింపు సమయంలో.. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. అయితే ఆ తర్వాత బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది.
VIDEO | “We have information that there are about 9-10 seats where 11-12 rounds of counting has been completed, however, the EC website and (TV) channels are showing trends available after only 4-5 rounds of counting. A kind of psychological games, mind games are being played.… pic.twitter.com/Mlwai2ZSyj
— Press Trust of India (@PTI_News) October 8, 2024