న్యూఢిల్లీ: విద్యార్థి కార్యకర్తలు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌కు 2020 నాటి ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో సోమవారం రాత్రి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో కొన్ని వామపక్ష విద్యార్థి సంఘాల సభ్యులు ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీకి వ్యతిరేకంగా అభ్యంతరకర నినాదాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. సంబంధిత విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని వర్సిటీ తెలిపింది.