పెండ్లి ఇష్టం లేదని ముందే చెప్పా
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పెండ్లి ఇష్టం లేదని తాను కేతన్కు ముందే చెప్పినట్టు నిందితురాలు సియా తెలిపింది. ఇప్పుడు అంత సమయం లేదని, పెండ్లి ఆపడం సాధ్యం కాదని తనపై కేతన్ వత్తిడి తెచ్చినట్టు సియా వివరించింది.
- పుణె కేసులో నిందితురాలు సియా గోయల్ వెల్లడి
- కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు
ముంబై, జూన్ 26 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పెండ్లి ఇష్టం లేదని తాను కేతన్కు ముందే చెప్పినట్టు నిందితురాలు సియా తెలిపింది. ఇప్పుడు అంత సమయం లేదని, పెండ్లి ఆపడం సాధ్యం కాదని తనపై కేతన్ వత్తిడి తెచ్చినట్టు సియా వివరించింది. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, ఇందుకు అతడు విగ్గు ధరించడమే కారణమని నిందితురాలు సియా తెలిపింది.
మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ కేతన్ కుటుంబం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను శుక్రవారం కలిసి విజ్ఞప్తి చేసింది. కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను నియమించారు.
తప్పు చేస్తే నా కూతుర్నీ తోసెయ్యండి
కేతన్ కేసులో తన కూతురు నేరం చేసినట్టు రుజువైతే ఆమెను కూడా అదే కోట నుంచి తోసెయ్యాలని సియా తల్లిదండ్రులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

