Boat Capsize | గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. గురువారం గుజరాత్లోని వడోదరలో హరిణి చెరువులో పడవ మునిగి 16 మంది దుర్మరణం పాలయ్యారు. విహార యాత్రకు వెళ్లిన 27 మందిలో 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు మరణించారు. మరో 10 మందిని సహాయ సిబ్బందికి బయటకు వెలికి తీశారు. పడవ స్థాయిని మించి ఎక్కడంతో బోల్తా కొట్టినట్లు తెలుస్తున్నది. ఒక విద్యార్థిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు.
ఈ కేసు విచారణను వడోదర జిల్లా మేజిస్ట్రేట్ కు అప్పగించారు. పది రోజుల్లో కేసు దర్యాప్తు చేసిన నివేదిక అప్పగించాలని ఆదేశించారు. మ్రుతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. గాయ పడిన వారికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని నిర్ణయించారు.
#WATCH | Gujarat: A boat carrying children capsized in Vadodara's Harni Motnath Lake. Rescue operations underway. pic.twitter.com/gC07EROBkh
— ANI (@ANI) January 18, 2024
ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన 23 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. వారిలో ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించలేదు. ఈ ప్రమాదం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Gujarat: A boat carrying children capsized in Vadodara's Harni Motnath Lake. Rescue operations underway. pic.twitter.com/gC07EROBkh
— ANI (@ANI) January 18, 2024
ఈ ఘటనపై సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోటు ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందడం పట్ల గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర సంతాపం తెలిపారు. సమాచారం తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Boat capsizes in Vadodara lake; death toll rises to 16: Police
— Press Trust of India (@PTI_News) January 18, 2024