లక్నో: జబల్పూర్ క్రూయిజ్ షిప్ ఘటనను మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో హమీర్‌పూర్‌లో పడవ బోల్తాపడటంతో ఆరుగురు గల్లంతయ్యారు. ముగ్గురిని సహాయక సిబ్బంది రక్షించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఎస్డీఎం అభిషేక్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పడవలో ఎవరూ లైఫ్ జాకెట్ ధరించలేదని సమాచారం. జబల్పూర్ ఘటన జరిగిన తర్వాత కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.