బెంగళూరు, డిసెంబర్ 21: కంటైనర్ ట్రక్ బోల్తా పడిన ప్రమాదంలో ఆరుగురు మరణించిన సంఘటన బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం జాతీయ రహదారిపై భారీ లోడ్‌తో వెళ్తున్న ఒక కంటైనర్ ట్రక్ నెలమంగళ వద్ద బోల్తా పడింది.
దాంతో పక్కనే ఉన్న ఒక కారు, బైక్ దాని కింద నలిగిపోవడంతో అందులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.