లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో గల చునార్ రైల్వే స్టేషన్లో కల్కా మెయిల్ ఎక్స్ప్రెస్ ఢీకొని ఆరుగురు భక్తులు చనిపోయారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్లాట్ఫామ్ నెం.3 దగ్గర పలువురు యాత్రికులు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొనడంతో వారి శరీరాలు ఛిద్రమయ్యాయి.
ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.