న్యూఢిల్లీ : మణిపూర్ హింసాకాండపై ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అల్లర్లు (Manipur Violence) కొనసాగుతున్న తీరు పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారని షాతో భేటీ అనంతరం సీఎం తెలిపారు. ఈశాన్య రాష్ట్రంలో పరిస్ధితి అలజడి రేపుతోందని, పరిస్ధితి అస్తవ్యస్తంగా ఉందని బీరెన్ సింగ్ వ్యాఖ్యానించడం విశేషం.
మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో కాల్పుల తో అల్లర్లు చెలరేగడం ఆందోళన కలిగిస్తోందని అమిత్ షా పేర్కొన్నారని సీఎం తెలిపారు. అల్లర్లు చెలరేగిన తొలినాళ్లలో రాజకీయంగా సున్నితమైన అంశంలా కనిపించినప్పటికీ ప్రస్తుత పరిస్ధితి మాత్రం అలజడి రేపుతున్నదని బీరెన్ సింగ్ వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో ఉగ్రవాదులు నిర్మించిన బంకర్లపై కేంద్ర భద్రతా దళాలు, రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపధ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం అక్కడి పరిస్ధితికి అద్దం పడుతోంది.
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో వివిధ జిల్లాల్లో మిలిటెంట్స్ నిర్మించిన 12 బంకర్లను బలగాలు ధ్వంసం చేశాయి. కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్, ఱాష్ట్ర మంత్రి సుశీంద్రో మీటై నివాసాలపై జరిగిన దాడుల గురించి హోంమంత్రి అమిత్ షా ప్రస్తావించారని సీఎం తెలిపారు.
Read More :