పూంచ్: జమ్ముకశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో వరదలు పోటెత్తుతున్నాయి. దాంతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పూంచ్ సెక్టార్లోని మెంధార్ ఏరియాలో కూడా ఇవాళ కుంభవృష్టి కురిసింది. దాంతో హర్ని నాలాకు ఆకస్మిక వరదలు ముంచుకొచ్చాయి.
దాంతో ఆ నాలా దాటుతున్న ఓ వ్యక్తి మధ్యలో చిక్కుకుపోయాడు. ఇది గమనించిన స్థానికులు తాడు సాయంతో అతని దగ్గరికి వెళ్లారు. అతడిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో ట్విటర్లో వైరల్ అవుతున్నది. కింది వీడియోలో రెస్క్యూ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు..
#WATCH | J&K: Flash flood in Harni Nallah witnessed due to heavy rainfall of Mendhar in Poonch. One person was rescued by people. pic.twitter.com/CeIfJDTHG2
— ANI (@ANI) June 25, 2023