Raja Saab | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం రాజాసాబ్ (Raja saab). మారుతి డైరెక్షన్లో పాన్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది మారుతి అండ్ ప్రభాస్ టీం. ఈ మూవీ నుంచి విడుదల చేసిన నాచే నాచే సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తుందని తెలిసిందే. అయితే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ అండ్ హీరోయిన్స్ టీంతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా డిస్కో డ్యాన్సర్ నుంచి ఐకానిక్ హిందీ సాంగ్‌ను రాజాసాబ్‌లో పెట్టాలనేది ఎవరి ఐడియా అని సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌ను అడిగాడు. దీనికి స్పందించిన ప్రభాస్ నాచే నాచే తన ఫేవరెట్ సాంగ్స్‌లో ఒకటి అని.. రాజాసాబ్‌లో ఈ పాట పెట్టింది డైరెక్టర్ మారుతి అని చెప్పాడు.
చాలా మంది అనుకున్నట్టు నాచే నాచే సాంగ్ మూవీ ఎండ్ క్రెడిట్స్‌లో కనిపించదని ఇప్పటికే డైరెక్టర్ మారుతి చెప్పడంతో.. ఇంతకీ నాచే నాచే పాట రాజాసాబ్ చిత్రంలో ఏ సందర్భంలో వస్తుందంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు .
మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన రాజాసాబ్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్స్‌కు మంచి స్పందన వస్తోంది. రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌కు విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రాజాసాబ్‌లో సంజయ్ దత్ సంజూబాబా పాత్రలో కనిపించబోతున్నాడు.
Anaganaga Oka Raju Trailer | నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ విడుదల
Sonu Sood | మరోసారి మానవత్వం చాటుకున్న రియల్ హీరో.. మూగజీవాల కోసం సోనూ సూద్ పోరాటం
Sara Arjun | IMDbలో సారా అర్జున్ సునామీ.. ప్రభాస్, విజయ్‌లను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌కు!