హసన్, జూన్ 8: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఆధారాల సేకరణపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దృష్టి సారించింది. ఈ మేరకు శనివారం హోలోనర్సిపూర్ ఉన్న ప్రజ్వల్ ఇంట్లో సిట్ అధికారులు పలు ఆధారాలు సేకరించారు.
ఆ సమయంలో సిట్ అధికారుల వెంట ప్రజ్వల్ కూడా ఉన్నారు. కాగా, సొంత ఊరికి ప్రజ్వల్‌ను తీసుకువెళ్లిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పో లీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మీడియాను సైతం అనుమతించలేదు. ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణ సిట్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.