న్యూఢిల్లీ, మార్చి 6: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఆప్ నేత మనీశ్ సిసోడియాను సోమవారం తీహార్ జైలుకు తరలించారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన ఈ నెల 20 వరకు జైలులో ఉండనున్నారు. గత నెల 26న సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా, ధర్మాసనం ఆయనకు 5 రోజులు సీబీఐ కస్టడీ విధించింది. సోమవారంతో అది పూర్తికావడంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరకపోవడంతో న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో ఆయనను జైలుకు తరలించారు.