భోపాల్: మధ్యప్రదేశ్లో ఈ నెల 23న రెండు సార్లు సైరన్ మోగనున్నది. మంగళవారం ఉదయం 11 గంటలకు తిరిగి సాయంత్రం 7 గంటలకు రెండు నిమిషాలపాటు సైరన్ మోగుతుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. సైరన్ మోగినప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడంపై ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా వ్యాపారులు తమ షాపుల ముందు సర్కిల్స్ గీయాలని పిలుపునిచ్చారు. తాను కూడా ఇవి చేస్తానని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన హిందీలో ట్వీట్ చేశారు.
మరోవైపు భోపాల్, ఇండోర్, జబల్పూర్లో ఆదివారం లాక్డౌన్ విధించడంపై శివరాజ్ సింగ్ మీడియాకు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, దీనిని నిలువరించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని, అయితే దీని వల్ల ఆర్థిక కార్యక్రమాలకు విఘాతం కలుగకూడదని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
23 मार्च को सुबह 11 बजे मध्यप्रदेश के सभी शहरों में सायरन बजेगा। जो जहाँ है, वहीं दो मिनट खड़े रहकर मास्क लगाने और सोशल डिस्टेंसिंग बनाने का संकल्प लेगा। दुकानदारों से भी अपील करता हूँ कि वे अपनी दुकानों के सामने दूरी रखने के लिए गोले बनाएँ। गोले बनाने मैं भी निकलूंगा।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) March 21, 2021