చండీగఢ్ : ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సర్ వల్ల 35 ఏండ్ల తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కలుసుకున్నారు. పంజాబ్లో ఉంటున్న రైల్వే ఉద్యోగి సీతారాంకు సర్లో భాగంగా ఆయన బాల్యంలో చదువుకున్న హర్యానాలోని మనోహర్పూర్ గ్రామంలో ఉన్న పాత స్కూల్ సర్టిఫికెట్ అవసరం అయింది. దీంతో ఆయన స్వగ్రామం వెళ్లారు. సీతారాం స్థానికతను వెరిఫై చేసుకునేందుకు స్కూల్ సిబ్బంది ఊర్లో ఆరా తీశారు. దీంతో సీతారాం సోదరుడు కృష్ణకు వచ్చిన వ్యక్తి 35 ఏండ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తన సోదరుడని తెలిసింది.