బెంగళూరు: కర్ణాటకలోని హంపీలో ప్రముఖ సింగర్ కైలాశ్ ఖేర్‌పై యువకులు దాడికిపాల్పడ్డారు. హంపీ ఉత్సవాల్లో భాగంగా జరిగిన సంగీత విభావరిలో గాయకుడు కైలాశ్ ఖేర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై పాటలు పాడుతుండగా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి యువకులు ఆయనపై వాటర్ బాటిల్ విసిరారు. అయితే అది అతనికి తాకనప్పటికీ.. సమీపంలో వచ్చిపడింది. ఇదేదీ పట్టించుకోకుండా ఖేర్ తన ప్రదర్శనను కొనసాగించారు. అక్కడే ఉన్న అధికారులు క్షణాల్లోనే ఆ బాటిల్‌ను స్టేజ్‌పై నుంచి తొలగించారు.
అయితే కైలాశ్ ఖేర్ పూర్తిగా హిందీ పాటలే పడుతుండటంతో కన్నడ సాంగ్స్ పాడలేదన్న ఆగ్రహంతో యువకులు దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. బాటిల్ విసిరిన వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కార్యక్రమం యథావిధిగా కొనసాగిందని వెల్లడించారు.