32 మందిని వదిలేసి వెళ్లిన స్కూట్ ఎయిర్‌లైన్
సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ 32 మంది ప్రయాణికులను అమృత్సర్ విమానాశ్రయంలోనే వదిలేసి టేకాఫ్ అయ్యింది. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఫిర్యాదు అందగా, విచారణకు ఆదేశించింది
అమృత్సర్, జనవరి 19: సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ 32 మంది ప్రయాణికులను అమృత్సర్ విమానాశ్రయంలోనే వదిలేసి టేకాఫ్ అయ్యింది. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఫిర్యాదు అందగా, విచారణకు ఆదేశించింది. పంజాబ్‌లోని అమృత్సర్ విమానాశ్రయం నుంచి రాత్రి 7.55 గంటలకు సింగపూర్ బయలుదేరాల్సిన విమానం మధ్యాహ్నం 3.45గంటలకే వెళ్లిపోయింది. దీంతో 32 మంది ప్రయాణికులు ఫ్లైట్ మిస్సయ్యారు.
ఆగ్రహానికి గురైన వారు అక్కడే నిరసనకు దిగారు. దీనిపై ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ఎయిర్‌పోర్టు అధికారులు ప్రశ్నించగా, ప్రయాణికులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చామని వెల్లడించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం షెడ్యూల్ మార్చామని, దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్రావెల్ ఏజెంట్లకు చేరవేసినట్టు చెప్పారు. అయితే, ఒక ట్రావెల్ ఏజెంట్ ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యాడని, దీంతో 32 మంది సమయానికి రాలేకపోయారని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

