ముంబై (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర నాసిక్‌లో 2026లో జరగనున్న సింహస్థ కుంభమేళా తేదీలను సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. ఆదివారం జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రులతో పాటు 13 అఖాడాల అధిపతులు, ప్రతి అఖాడా నుంచి ఇద్దరు సాధువులు, మహంతులు హాజరయ్యారు.
కుంభమేళా కోసం రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు మొదలు పెట్టినట్టు సీఎం తెలియజేశారు. నాసిక్, త్రయంబకేశ్వర్ రెండు చోట్లా వచ్చే ఏడాది అక్టోబర్ 31న కుంభమేళాను ప్రారంభించనున్నారు.