Adar Poonawalla | పెరుగుతున్న కరోనా కేసులు.. అదర్ పూణావాలా ఆసక్తికర వ్యాఖ్యలు..!
Adar Poonawalla | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ ఉధృతి నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కేసులు పెరుగుతున్నా పెద్దగా ప్రమాదమేమీ లేదని ఆరోగ్యశాఖ పేర్కొంది. మార్చి నుంచి కొవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూణావాలా మీడియాతో మాట్లాడారు.
Adar Poonawalla | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ ఉధృతి నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కేసులు పెరుగుతున్నా పెద్దగా ప్రమాదమేమీ లేదని ఆరోగ్యశాఖ పేర్కొంది. మార్చి నుంచి కొవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూణావాలా మీడియాతో మాట్లాడారు. ఐదు నుంచి ఆరు మిలియన్ డోసుల కొవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వైరస్ ఏమీ తీవ్రంగా లేదని, తేలికపాటి వేరియంట్లు మాత్రమేనన్నారు. అయితే, ముందుజాగ్రత్తగా వృద్ధులు బూస్టర్ డోస్ తీసుకోవచ్చన్నారు.
అయితే, వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా? అనేది వారి ఇష్టమన్నారు. ప్రస్తుతం ఆరు మిలియన్ల కోవోవాక్స్ కొవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చే రెండు మూడు నెలల్లో అదే మొత్తం కొవిషీల్డ్ వ్యాక్సిన్లను సైతం ఉత్పత్తి చేస్తామని పూణావాలా తెలిపారు. ఇదిలా ఉండగా.. గత 24 గంటల్లో దేశంలో 12,193 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరో వైపు ముంబయిలో ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ ప్రభావం చూపుతున్నది. అదే సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర సహా ఎనిమిది రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

