బెంగళూరు: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌తోపాటు ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, తమిళనాడు, ఝార్ఖండ్, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు, ఎన్సీపీ అధ్యక్షుడు పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా హాజరయ్యారు.