Muda Scam | కర్నాటక గవర్నర్ వివక్ష : సిద్ధరామయ్య ఫైర్
Muda Scam : ముడా స్కామ్ కేసులో తనపై ప్రాసిక్యూషన్కు తక్షణమే ఆమోదం తెలిపిన గవర్నర్ వివక్ష ప్రదర్శించారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.
Muda Scam : ముడా స్కామ్ కేసులో తనపై ప్రాసిక్యూషన్కు తక్షణమే ఆమోదం తెలిపిన గవర్నర్ వివక్ష ప్రదర్శించారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. మైనింగ్ కేసులో కేంద్ర మంత్రి, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి విచారణకు అనుమతించడంలో మాత్రం జాప్యం చేస్తున్నారని ఇది వివక్ష కాక మరేమిటని సీఎం ప్రశ్నించారు. సిద్ధరామయ్య బుధవారం కొప్పోల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తనపై ఎలాంటి దర్యాప్తు నివేదికను పరిగణనలోకి తీసుకోకుండానే గవర్నర్ సత్వరమే తన ప్రాసిక్యూషన్కు అనమతించారని. ఇది గవర్నర్ వివక్ష ధోరణి కాదా అని సీఎం నిలదీశారు. కాగా, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పాలక, విపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
బెంగళూర్లోని జేడీఎస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాల గురించి తాను మాట్లాడితే 2007 మైనింగ్ కేసులో తన ప్రాసిక్యూషన్కు అనుమతించాలని ప్రభుత్వం గవర్నర్ను కోరుతున్నదని వ్యాఖ్యానించారు. మరోవైపు కర్నాటక గవర్నర్ను కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని కాషాయ నేతలు చేస్తున్న విమర్శలపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. గవర్నర్ తీరును ప్రశ్నిస్తే అవమానించినట్టా అని ఆయన ప్రశ్నించారు.
Read More :
Subramanian Swamy: ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

