North VS South : పన్ను బకాయిల చెల్లింపు, పన్నుల పంపిణీలో కర్నాటక పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసన చేపట్టారు.
నిధుల కేటాయింపులు, పన్ను చెల్లింపులు, గ్రాంట్ల విషయంలో కర్నాటక సహా దక్షిణాది పట్ల మోదీ సర్కార్ వివక్ష చూపుతోందని కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ తీరుతో గత కొన్నేండ్లుగా కర్నాటకకు రూ. 62,098 కోట్ల పన్ను రాబడి నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 5485 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను తిరస్కరించారని, రింగ్ రోడ్, వాటర్ బాడీలకు రావాల్సిన రూ. 3000 కోట్లు నిలిపివేశారని అన్నారు. రూ. 17,000 కోట్ల కరువు నిధులను నిలిపివేశారని మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కర్నాటకకు మొత్తం రూ. 73,593 కోట్ల నిధులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నాటక నుంచి వసూలైన పన్నుల్లో ప్రతి రూ. 100పై రాష్ట్రానికి కేవలం రూ. 13 మాత్రమే దక్కుతోందని అన్నారు.
Read More :