మైసూరు: ‘ముడా’ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్యపై కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. దసరా తర్వాత సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేయవచ్చునని అన్నారు. ఆదివారం మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ, ‘రోజూ మీడియా ముందుకు వచ్చి తానే సీఎం అని సిద్ధరామయ్య చెప్పుకునే పరిస్థితి ఉంది. దసరా తర్వాత ఏ క్షణమైనా సీఎం పదవికి ఆయన రాజీనామా చేయొచ్చు! అని అన్నారు.