Siddaramaiah | త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కొడుకు స్థానం నుంచి పోటీకి సిద్ధమైన సిద్ధరామయ్య
Siddaramaiah | కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. కర్ణాటక అసెంబ్లీకి (Karnataka Assembly Elections) త్వరలో ఎన్నికలు జరుగునున్నాయి. ఎన్నికల్లో సిద్ధ రామయ్య.. తన కుమారుడి స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు.
Siddaramaiah | కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. కర్ణాటక అసెంబ్లీకి (Karnataka Assembly Elections) త్వరలో ఎన్నికలు జరుగునున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడనప్పటికీ రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress) పార్టీ 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను (first list) విడుదల చేసింది. ఇందులో పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య (Siddaramaiah), పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) కూడా ఉన్నారు. ఎన్నికల్లో సిద్ధ రామయ్య.. తన కుమారుడి స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. శివకుమార్ కనకపుర నియోజకవర్గం ( Kanakapura constituency) నుంచి బరిలోకి దిగుతున్నారు.
సిద్ధరామయ్య (Siddaramaiah) గతంలో మైసూరులోని (Mysuru) వరుణ నియోజకవర్గం (Varuna constituency) నుంచి బరిలోకి దిగి చాలా సార్లు విజయం సాధించారు. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు యతీంద్ర (Yathindra Siddaramaiah) కోసం సిద్ధరామయ్య తన సీటును త్యాగం చేశారు. అప్పుడు బదామీ (Badami) నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన కోలార్ (Kolar) నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ముందుగా భావించారు. అయితే, కోలార్ (Kolar) నుంచి కాకుండా వరుణ (Varuna) నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ (Rahul Gandhi) సూచన మేరకు సిద్ధ రామయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సిద్ధ రామయ్య వరుణ నుంచి పోటీ చేస్తుండటంతో.. వచ్చే ఎన్నికల్లో యతీంద్ర ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై ఇంకా ఇంకా స్పష్టత రాలేదు. తాజా జాబితాలో ఆయన పేరు లేదు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యతీంద్రకు ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువుకన్నా ముందే ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. కాగా, 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 78 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు కైవసం చేసుకుంది. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చెరో సీటు గెలుచుకున్నాయి. ఒక ఇండిపెండెంట్ సైతం గొలుపొందారు. 2019లో జేడీఎస్తో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులకే బీజేపీ కుట్రచేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చింది. దాంతో ఈసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. బీజేపీ రెబెల్స్ బెడదను ఎదుర్కొంటున్నది.
Also Read..
Kushboo Sundar | రాహుల్కు జైలు శిక్ష.. మోదీ ఇంటిపేరుపై ఖుష్బూ చేసిన పాత ట్వీట్ వైరల్
Mark Zuckerberg | మూడోసారి తండ్రైన మార్క్ జుకర్బర్గ్.. ఫొటో షేర్ చేసిన మెటా సీఈవో
Rahul Gandhi | సెప్టెంబర్లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

