బెంగళూరు, సెప్టెంబర్ 14: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేంద్రమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. దివ్యాంగుడైన దళితుడి స్థలాన్ని ఆక్రమించి సిద్ధరామయ్య ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…
సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు దివ్యాంగుడైన దళితుడికి కేటాయించిన స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించారని పేర్కొన్నారు. సకమ్మ అనే పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి, తాను ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్టు చూపించి సిద్ధరామయ్య ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు. దీనిపై తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు.