సిమ్లా: స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యామ్ శరణ్ నేగి కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 106 ఏండ్ల శ్యామ్ శరణ్.. హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలమైన కల్పాలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సంతాపం తెలిపారు. నేగి అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించారు. త్వరలో జరుగనున్న హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 2న పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆయన తన ఓటుహక్కు వినియోగించుకున్న విషయం తెలిసిందే. నేగీ ఎన్నికల్లో ఓటువేయడం ఇది 34వ సారి.

శ్యామ్ శరణ్ నేగీ.. 1917, జూలైలో జన్మించారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఓటుహక్కు వినియోగించుకున్నవారిలో ఒకరిగా గుర్తింపుపొందారు. 1951 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆయన ఓటువేశారు. ఇప్పటివరకు 16 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. 2014 నుంచి రాష్ట్ర ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన నేగీ.. 1975లో రిటైర్ అయ్యారు.


Himachal Pradesh | 106-year-old Shyam Saran Negi, the first voter of Independent India, passed away this morning at his native place in Kalpa. He will be cremated with full state honour: DC Kinnaur https://t.co/gMtKSstqjp
— ANI (@ANI) November 5, 2022