న్యూఢిల్లీ, జూలై 14: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాములతో కూడిన డ్రాగన్ వ్యోమనౌక మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు భూమి మీదకు చేరుకోనున్నది. వీరు ప్రయాణించే స్పేస్‌క్రాఫ్ట్ సోమవారం మధ్యాహ్నం 4.45 గంటలకు ఐఎస్ఎస్తో అన్‌డాకింగ్ ప్రక్రియ పూర్తిచేసుకుంది. కక్ష్య నుంచి విడిపడటానికి డ్రాగన్‌లోని థ్రస్టర్లను రెండుమార్లు మండించారు.
దీనికంటే ముందు ఆలింగనాలు, కరచాలనాలతో ఐఎస్ఎస్లో ఇతర వ్యోమగాములకు శుభాన్షు శుక్లా బృందం వీడ్కోలు పలికింది. డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక దాదాపు 22 గంటలపాటు అంతరిక్షంలో ప్రయా ణించి మంగళవారం మధ్యాహ్నం కాలిఫోర్నియా తీరంలోని సముద్ర జలాల్లో ‘స్ప్లాష్‌డౌన్’ అవుతుందని సమాచారం.