న్యూఢిల్లీ: అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా భారత్‌కు చేరుకున్నారు. యాక్సియం-4మిషన్‌లో తనకు బ్యాకప్ ఆస్ట్రోనాట్‌గా ఉన్న ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌తోపాటు శుక్లా ఆదివారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఇస్రో చైర్మెన్ వీ నారాయణన్ తదితరులు భారత వ్యోమగాములకు ఘన స్వాగతం పలికారు. యాక్సియం-4 మిషన్ అనుభవాల్ని పంచుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా నుంచి బయల్దేరే ముందు శుక్లా ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశారు. భారత్‌కు చేరుకున్న శుక్లా మరికొద్ది గంటల్లో భారత ప్రధాని మోదీని కలుసుకునే అవకాశముంది.