లక్నో: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రెసిడెంట్ మహంత్ నృత్య గోపాల్ దాస్(Mahant Nritya Gopal Das ) ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆయన్ను లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూ వార్డులో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఓ డాక్టర్ల బృందం ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నది. మూత్రాశయ, ఉదర సంబంధిత రుగ్మతలతో ఆయన బాధపడుతున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన్ను మేదాంత హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనేందుకు మథుర వెళ్లిన సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. తొలుత గ్వాలియర్లో ఆయనకు చికిత్స అందించారు. కోలుకోకపోవడంతో ఆయన్ను లక్నోకు తరలించారు.