Nitin Gadkari : ఇరవై శాతం ఇథనాల్ (Ethenol) కలిపిన పెట్రోల్ వాడకంవల్ల వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గుతుందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి (Union Minister) నితిన్ గడ్కరీ (Nitin gadkari) తోసిపుచ్చారు. ఇ-20 పెట్రోల్ (E20 Petrol) వల్ల సమస్య వచ్చిన ఒక్క కారు పేరు అయినా చెప్పాలన్నారు. ఇథనాల్ బ్లెండింగ్‌పై కావాలనే విమర్శకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఇ-20 పెట్రోల్ వాడకంవల్ల ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. E20 పెట్రోల్ కారణంగా సమస్య ఎదుర్కొంటున్న ఒక్క కారునైనా చూపించండి. ఇథనాల్ బ్లెండింగ్‌పై జరుగుతోన్న ప్రచారం కేవలం పెయిడ్ క్యాంపెయిన్. అందులో వాస్తవం లేదు’ అని ఆయన కొట్టిపారేశారు. దేశం ఏటా ఇంధన దిగుమతుల కోసం రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇథనాల్ తయారు చేయాలనే నిర్ణయంతో రైతులకు దాదాపు రూ.45 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందన్నారు.