Omar Abdullah | అలా అయితే.. ‘ఇండియా’ కూటమి పొత్తును ముగించండి: ఒమర్ అబ్దుల్లా
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకే అయితే ‘ఇండియా’ కూటమి పొత్తును ముగించాలని సూచించారు. ఆ కూటమికి నాయకత్వం, ఎజెండా వంటివి ఏమీ లేకపోవడాన్ని ఆయన విమర్శించారు.
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకే అయితే ‘ఇండియా’ కూటమి పొత్తును ముగించాలని సూచించారు. ఆ కూటమికి నాయకత్వం, ఎజెండా వంటివి ఏమీ లేకపోవడాన్ని ఆయన విమర్శించారు. ‘ఇండియా’ కూటమిలో భాగమైన ఆప్, కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంపై గురువారం మీడియా అడిగిన ప్రశ్నకు ఒమర్ అబ్దుల్లా సమాధానమిచ్చారు. ‘దీని గురించి నేను ఏమీ చెప్పలేను. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికలతో మాకు సంబంధం లేదు. ఆప్, కాంగ్రెస్, క్షేత్రస్థాయిలో ఉన్న ఇతర పార్టీలు బీజేపీని ఎలా ఎదుర్కోవాలో నిర్ణయించుకోవాలి’ అని అన్నారు.
కాగా, తనకు తెలిసినంత వరకు ‘ఇండియా’ బ్లాక్‌కు ఎలాంటి కాలపరిమితి లేదని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు కూటమి సమావేశాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. దీంతో కూటమి నాయకత్వం, ఎజెండా, ఉనికి గురించి తనకు స్పష్టత లేదని అన్నారు. ‘అది (ఇండియా బ్లాక్) కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే అయితే వారు కూటమిని ముగించాలి’ అని సూచించారు.
#WATCH | Jammu: J&K CM Omar Abdullah says, “… I cannot say anything about what’s going on in Delhi because we have nothing to do with Delhi Elections… As far as I remember, there was no time limit to the INDIA alliance. Unfortunately, no INDIA alliance meeting is being… pic.twitter.com/u9w9FazeJG
— ANI (@ANI) January 9, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- Alliance
- Congress
- Delhi Fight
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

