సిమ్లా: కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్లో దుకాణాలు, వాణిజ్య సంస్థలు ఇకపై రోజంతా నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర కార్మిక చట్టాల్లో సవరణలు చేసినట్టు ఆయన చెప్పారు. మంగళవారం కార్మిక, ఉపాధి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఈ సవరణలు వ్యాపారాలకు మరింత వెసులుబాటును, వినియోగదారులు తమకు అనువైన సమయంలో కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తుంది’ అని సుఖు అన్నారు. ధ్రువీకరణ పత్రాలు, లైసెన్సులు సహా అన్నీ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.