IRS Officer Daughter: ఐఆర్ఎస్ ఆఫీసర్ కూతురిపై లైంగిక దాడి.. ఫోన్ ఛార్జింగ్ వైర్‌తో మర్డర్
IRS Officer Daughter: ఢిల్లీలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె అత్యంత దారుణంగా మర్డర్ అయ్యింది. ఈ ఘటన అమర్ కాలనీ ప్రాంతంలో ఉన్న ఇంట్లో జరిగింది. 21 ఏళ్ల యువతిపై తొలుత లైంగిక దాడి జరిగింది. ఆ తర్వాత మొబైల్ ఫోన్ ఛార్జింగ్ వైర్‌తో హత్య చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఇండియన్ రెవన్యూ సర్విస్ అధికారి కుమార్తె(IRS Officer Daughter) అత్యంత దారుణంగా మర్డర్ అయ్యింది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీ ప్రాంతంలో ఉన్న ఇంట్లో జరిగింది. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేపడుతున్నారు. అనుమానాస్పద రీతిలో బాధిత యువతి మృతిచెంది ఉన్నట్లు ఇంట్లోవారు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బాధిత వ్యక్తిపై తొలుత లైంగికంగా దాడి చేసి, ఆ తర్వాత మర్డర్ చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఆ యువతిని చంపేందుకు నిందితుడు మొబైల్ ఫోన్ చార్జింగ్ వైర్‌ను వాడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఆ వైర్‌తో ఆమె గొంతుకు ఉరి వేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. మర్డర్‌కు గురైన అమ్మాయి వయసు 21 ఏళ్లు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలిసింది. ఇంట్లో పనిమనిషి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. నెల రోజుల క్రితమే అతన్ని ఇంటి నుంచి తరిమేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

