India Alliance | ప్రతిపక్ష కూటమిలోని కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కూటమికి చెందిన మరో పార్టీ ఆమ్ ఆద్మీ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని స్పష్టం చేసింది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు పొత్తులను సీఎం భగవంత్ మాన్ తోసిపుచ్చారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఒంటిగా వెళ్లాలనే నిర్ణయంతో పాటు ఆప్ సైతం దాన్ని అనుసరిస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘పంజాబ్‌లో అలాంటిదేమీ (కాంగెస్తో పొత్తు) లేదు.. మాకు కాంగ్రెస్‌తో ఏమీ లేదు’ అన్నారు. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశం ఉందని ఇప్పటికే పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని ఆప్ పంజాబ్ యూనిట్ చేసిన ప్రతిపాదనకు కేజ్రీవాల్ సైతం ఆమోదం సంబంధిత వర్గాలు తెలిపాయి. పంజాబ్ విషయంలో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ హైకమాండ్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని.. ఈ క్రమంలోనే భగవంత్ మాన్ ప్రకటన చేసినట్లు తెలుస్తున్నది. పంజాబ్‌లో పొత్తులపై పంజాబ్ కాంగ్రెస్ సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది.
చండీగఢ్‌లోని పంజాబ్ కాంగ్రెస్ భవన్లో పార్టీ వార్‌రూమ్ ఏర్పాటు చేసి.. రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి వరకు నాయకులతో నేరుగా సమన్వయం చేయడం ద్వారా డివిజన్ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేయనున్నది. అంతకుముందు, 13 లోక్‌సభ నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమించి.. స్థానిక నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసే బాధ్యతలను అప్పగించింది. పంజాబ్ కాంగ్రెస్ కొత్తగా ఏర్పాటు చేసిన వార్ రూమ్‌లో పార్టీ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారులు హెచ్ఎస్ కింగ్రా, రాజ్వంత్ రాయ్ శర్మ, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అమన్ స్లాచ్, కుల్జీత్ సింగ్ బేడీ, జంగ్ప్రీత్ సింగ్‌లు ఉన్నారు.
#WATCH | On TMC leader Mamata Banerjee saying “Will fight alone” during Lok Sabha polls in Bengal, Punjab CM & AAP leader Bhagwant Mann says, “…In Punjab, we will not do anything (alliance with Congress) like that, we have nothing with Congress.” pic.twitter.com/JVBY8FtjJV
— ANI (@ANI) January 24, 2024