బెంగళూరు: కరోనా మహమ్మారి కట్టడి కోసం కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతున్నది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అయితే శని, ఆదివారాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రోజూ నాలుగేసి గంటల చొప్పున కర్ఫ్యూ వేళల్లో సడలింపు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఆదివారం కర్ఫ్యూ సడలింపు వేళల్లో కిరాణ దుకాణాలు, ఇతర నిత్యావసర దుకాణాల ముందు జనం బారులు తీరారు. శనివారం ఉదయం 10 గంటల తర్వాత వెలవెలబోయిన వీధులు ఈ ఉదయం ఒక్కసారిగా కళకళలాడాయి. ఉదయం 10 గంటల తర్వాత మళ్లీ ఎప్పటిలాగే వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. శివమొగ్గలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో నిత్యావసరాల కోసం జనం రోడ్ల మీదకు వచ్చిన దృశ్యాలను ఈ కింది చిత్రాల్లో చూడవచ్చు.
Shivvamogga: A large number of people seen on streets as food and grocery shops are allowed to remain open from 6 am to 10 am during state-wide weekend curfew which will be in force till 6 am on April 26#Karnataka pic.twitter.com/Q0na4s8mVn
— ANI (@ANI) April 25, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత