Shivraj Singh Chouhan| మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former CM) శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం రాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని ఆసుపత్రికి తరలించడంలో చొరవ చూపారు.
భోపాల్ (Bhopal)లోని రవీంద్ర భవన్ (Ravindra Bhavan) సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం (road accident)లో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న చౌహాన్.. ప్రమాద ఘటనను గుర్తించి తన కాన్వాయ్‌ని ఆపారు. గాయపడిన యువకుడిని హుటాహుటిన తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు చౌహాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలానే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడి చౌహాన్ తన పెద్ద మనసు చాటుకున్నారు.
वरिष्ठ भाजपा नेता शिवराज सिंह चौहान भले अब मध्य प्रदेश के मुख्यमंत्री नहीं है लेकिन लोगों की मदद के लिए उनका जज्बा अभी भी बरकरार है। #HindiNews #NewsUpdate #Viralvideo #ShivrajSinghChouhan #BJP4IND #socialmedia #accidente #Webdunia @WebduniaHindi @ChouhanShivraj pic.twitter.com/koFAvuVmuC
— Webdunia Hindi (@WebduniaHindi) December 16, 2023
Also Read..
Gang Raped | కదులుతున్న బస్సులో దళిత యువతిపై సామూహిక అత్యాచారం.. ఒకరు అరెస్ట్
iPhone | యాపిల్ యూజర్లకు కేంద్రం అలర్ట్