భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ ఆలయంలో శివలింగాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఆలయంలో శివలింగం ధ్వంసం కావడంపై గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామని భోపాల్ ఏసీపీ సచిన్ అతుల్కర్ తెలిపారు.
శివలింగాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించేందుకు స్ధానికులను ప్రశ్నిస్తున్నామని, సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నామని చెప్పారు. నిందితుడు తాగిన మైకంలో శివలింగాన్ని ధ్వంసం చేశాడని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని ఏసీపీ తెలిపారు.