యూపీలో 50-100 స్థానాల్లో పోటీ.. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్
Sanjay Raut: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల్లో బిజీబిజీగా ఉన్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలు ఇప్పటికే అస్త్రశస్త్రాలను

ముంబై: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల్లో బిజీబిజీగా ఉన్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలు ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. అయితే అధికార పార్టీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతుండటం యోగీ శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నది. ఇక బహుజన్ సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా యూపీలో ఎన్నికల్లో పోటీకి సమాయత్తమయ్యాయి.
ఈ క్రమంలోనే మహారాష్ట్రలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న శివసేన పార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రకటించారు. యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకుగాను 50 నుంచి 100 అసెంబ్లీ స్థానాల్లో తాము కూడా బరిలో దిగబోతున్నామని ఆయన చెప్పారు. దీనిపై స్థానిక నాయకులతో చర్చించేందుకు రేపు పశ్చిమ యూపీకి వెళ్తున్నానని రౌత్ వెల్లడించారు.
కాగా, రౌత్ వ్యాఖ్యలను నెటిజన్లు ట్విట్టర్లో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత సీఎం అయ్యేది శివసేన అభ్యర్థేనేమో అని కొందరు ఎగతాళి చేశారు. శివసేన ఒక్క స్థానంలో నోటాను ఓడించినా సంబురాలు చేసుకుంటుందని మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు. అభ్యర్థుల డిపాజిట్ల రూపంలో ఈసీకి ఇక డబ్బులే డబ్బులు అని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

