ముంబై: మహారాష్ట్రలోని అధికార మహాయుతి సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు బయటపడుతున్నాయి. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన మంత్రి తానాజీ సావంత్ (Tanaji Sawant) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సహచరుల పక్కన కూర్చున్న తర్వాత తనకు వాంతులు అవుతున్నాయని అన్నారు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో శివసేన మంత్రి తానాజీ సావంత్ మాట్లాడారు. తాను హార్డ్కోర్ శివ సైనికుడినని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేతలతో తనకు ఎప్పుడూ సఖ్యత లేదని చెప్పారు. ‘మేం (అజిత్ పవార్, నేను) క్యాబినెట్లో పక్కపక్కనే కూర్చున్నప్పటికీ బయటకు వచ్చిన తర్వాత నాకు వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది’ అని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, శివసేన మంత్రి తానాజీ సావంత్ వ్యాఖ్యలు అధికార మహాయుతి సంకీర్ణ ప్రభుత్వంలో కలకలం రేపాయి. ఎన్సీపీ అధికార ప్రతినిధి, శాసన మండలి సభ్యుడు అమోల్ మిత్కారీ ఆయన వ్యాఖ్యలను ఖండించారు. బలహీనమైన సంకీర్ణాన్ని కొనసాగించడం తమ పార్టీ బాధ్యత మాత్రమేనా? అని ప్రశ్నించారు. సంకీర్ణ ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే తాము మౌనంగా ఉన్నామని అన్నారు.
STORY | Sit next to NCP ministers at cabinet meetings but it’s nauseating: Shiv Sena’s Tanaji Sawant
READ: https://t.co/fMan6gEu4U
VIDEO:
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/YQIlgm72Hf
— Press Trust of India (@PTI_News) August 30, 2024