హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ టీ20 లీగ్‌కు సోమవారం తెరలేవనుంది. మహబూబ్‌నగర్ వేదికగా టీ20 టోర్నీ తొలి అంచె పోటీలు మొదలుకానున్నాయి. జిల్లా కేంద్రంలోని మైదానంలో మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగనుంది.
ఈనెల 27 వరకు జరిగే తొలి దశలో హైదరాబాద్, రంగారెడ్డి మినహా 29 జిల్లాల జట్లు పోటీపడుతున్నాయి. వీటి నుంచి ఎనిమిది ఉమ్మడి జిల్లాలకు తోడు హైదరాబాద్, రంగారెడ్డి జట్లతో రెండో అంచె పోటీలు ఈనెల 29 నుంచి జనవరి 17 వరకు 49 మ్యాచ్‌లు జరుగుతాయి.